మధిర పోలీస్ స్టేషన్లను సందర్శించిన వైరా ఏసిపి రెహమాన్

Published: Monday July 11, 2022

మధిర  జులై 9 ప్రజాపాలన ప్రతినిధి వైరా ఏసిపిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెహమాన్ శనివారం మధిర సర్కిల్ కార్యాలయాన్ని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లు పరిశీలించారు .ఈ సందర్భంగా  పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేవా?అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కాజీపురం వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల గురించి సీఐ వడ్డేపల్లి మురళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెహ్మాన్ మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు వైరా సబ్ డివిజన్లో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రజల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట సిఐ వడ్డేపల్లి మురళి టౌన్ రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్ నరేష్ పాల్గొన్నారు