ఈ భూములు మీవే పోరాటం చేయండి. ..8 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదు. ..వైఎస్సార్ బ్ర

Published: Friday July 22, 2022
మంచిర్యాల బ్యూరో, జులై21, ప్రజాపాలన:
 
గత 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదు,
ఈ భూములు మీవే పోరాటం చేయండి మీకు అండగా ఉంటాను అని పోడుభూముల పట్టాలకోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు బరోసా ఇచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గురువారం మంచిర్యాల జిల్లా దండెపెల్లి మండలం కోయపోచం గూడెంలో సాగుభూముల పట్టాల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ గిరిజనులను ఆమె కలిశారు. పోడుభూముల పట్టాలకోసం చేస్తున్న పోరాటం లో జైలుకే ల్లిన గరిజన మహిళలను ఓదార్చారు.స్థానికంగా జరిగిన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు అని చూడకుండా తమను బట్టలు ఊడ దీసి కొట్టారంటూ  గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 2002 నుంచి గిరిజనులు పోడు భూములను సాగు చేసుకుంటున్న 
 ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పోవడం దారుణం అని అన్నారు.  వైఎస్సార్  బతికి ఉంటే వీరికి పట్టాలను చేతుల్లో పెట్టే వారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల కోసం అబద్దపు హామీ లు ఇస్తాడని విమర్శించారు.
 
* పోడు చట్టాలు మార్చాలట.
 
ఈ భూములు మావి అని 52 కుటుంబాలు ప్రతి ఏడాది పోరాటం చేస్తున్నారన్న ఆమే  పోడు భూముల పట్టాలు అడిగితే గొడ్డలి తో నరికేస్తరా..?
 జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలకు గురి చెస్తారా అంటు మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో ఆడవారికి కనీసం రక్షణ లేదని పేర్కొన్నారు. మనుషులు ఉండే సమాజం అని కూడా సర్కారు కు సోయి లేదా అని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఅర్ హామీ ఇచ్చారు కదా..!  కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని అన్నారు కదా..! మరి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు పోడు చట్టాలు మార్చాలని  కేసీఆర్ చెప్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఇదే చట్టం తోనే పోడు భూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.