ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి

Published: Friday July 02, 2021
వికారాబాద్ జూలై 02 ప్రజాపాలన బ్యూరో : ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. పంచాయతీలకు ఇచ్చిన లక్ష్యాలను చేరేలా గ్రామాల్లో మొక్కలు నాటాలని అన్నారు. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే హరిత హారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంట్లో 5 మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతో మొక్కలను నాటాలని కోరారు. ఈ సంధర్బంగా పెద్దపూర్ గ్రామానికి చెందిన పలువురు జడ్పి చైర్ పర్సన్ ను కలిసి గ్రామాభివృద్ధికి  తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.