PMR అవార్డుకు ఎంపికైన మధిర ఉపాధ్యాయులు

Published: Tuesday September 28, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : విద్యా రంగం, సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను ఖమ్మంకు చెందిన PMR ట్రస్ట్ వారు పెందుర్తి మధుసూదన్ రావు స్మారక అవార్డులను మధిరకు చెందిన ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, చేడే శ్రీనివాస్, మేడేపల్లి శ్రీనివాసరావులకు అందించటం జరిగిందని ఆ సంస్థ నిర్వాహకులు నరేంద్ర స్వరూప్, దసరధ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు హోమియో మందులు, మాస్క్ లుఉచితంగా పంపిణీ చేసినందుకుగాను సంక్రాంతి శ్రీనివాసరావుకు, కరోనా సమయంలో ఆన్లైన్ చదువులకు దూరమౌతున్న విద్యార్థులకు దాతల సహాయంతో చరవాణిలు అందిస్తూ, పేద ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందించినందుకు గాను చేడే శ్రీనివాస్ కు, కరోనా సమయంలో తమ పాఠశాల విద్యార్థులతో పాటు మండలంలోని ఇతర పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిమిత్తం ఉచిత ఆన్లైన్ సేవలు అందిస్తూ వారు ప్రతిభా కళాశాలలకు ఎంపికయ్యేలా కృషి చేయడమే కాకుండా ప్రతి ఆదివారం హోమియో హాస్పిటల్ నందు వాలంటీర్ గా సేవలు అందించినందుకు గాను మేడేపల్లి శ్రీనివాసరావు లు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపార  ఈ సందర్భంగా మధిర మండల విద్యాశాఖ అధికారి శ్రీ వై ప్రభాకర్ మాట్లాడుతూ నిరంతరం విద్యార్థుల కోసం శ్రమించే ఉపాధ్యాయులకు అవార్డ్స్ రావడం అభినందనీయం అని తెలుపుతూ, ఇలా సేవలు అందించే ఉపాధ్యాయులను ఎంపిక చేసిన PMR ట్రస్ట్ వారికి ధన్యవాదములు తెలియజేసారు.