విజయానికి ప్రతీక దీపావళి.. అన్నారుగూడెం కార్యదర్శి వేణు..

Published: Tuesday October 25, 2022

 తల్లాడ, అక్టోబర్ 23 (ప్రజా పాలన న్యూస్): విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను ప్రజలు జరుపుకుంటారని తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ కార్యదర్శి వేణు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దీపావళి పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పండుగ రోజు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.