రైతులకు 'కిసాన్ సమ్మాన్ నిధి' చేయూత.. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్

Published: Saturday May 15, 2021
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదల చేయడం రైతులకు చేయూత నిస్తుందని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 8వ, విడుతల్లో భాగంగా సుమారు 9 కోట్ల 50 లక్షల కుటుంబాలకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో రైతుల బాధలు చూడలేక ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డబ్బులు జమ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుండడంతో రైతులు పనులు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో కిసాన్ సమ్మాన్ నిధి నిధులు రావడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో కూడా రైతుబంధు రాని వాళ్ళందరికీ మరియు గతంలో పెండింగ్లో ఉన్న రైతులందరికీ ఈ కష్టకాలంలో రైతుబంధును అందజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు సురేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.