ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య

Published: Tuesday September 06, 2022
బెల్లంపల్లి  సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి:   ఈ నెల 12, 13 తేదీలలో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించే ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని  ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ కోరారు. 
సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని  బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 12, 13, తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే జాతీయ మహాసభలలో ఎమ్మార్పీఎస్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, కావున గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, ప్రతి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలతో, సహా మాదిగ జాతికి చెందిన ప్రతి బిడ్డ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 దేశంలో ఇంకా అంటరానితనం కొనసాగుతుందని దానికి ప్రత్యేక ఉదాహరణ ఇటీవల ఇంద్రకుమార్ మేఘ్వాల్, అనే దళిత బాలుడి హత్య సంఘటన దానికి ఉదాహరణమని  పేర్కొన్నారు.
ఈ ఘటనపై  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని, ఇప్పటికే విద్యాసంస్థల బంద్ ప్రకటించి విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఇంత జరిగినా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయంపై స్పందించకపోవడం దారుణమన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర  వేడుకలలో పాల్గొన్న మోడీ అంటరానితనంపై, అంటరానితనాన్ని నిర్మూలనపై, మాట్లాడలేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మార్పీఎస్ ఒక వర్గీకరణ విషయమే  కాకుండా దేశంలో ఏ మూలన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు సమస్య వచ్చినా ముందుండి పోరాడుతుందని అన్నారు. 
బెల్లంపల్లిలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి ఈనెల 18న నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ తో పాటు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్లకొండ సంజయ్ మాదిగ, జనగామ మల్లేష్ మాదిగ, బొంకూరి రామచందర్, ఓరుగంటి రవీందర్, రత్నం ఐలయ్య, రామకృష్ణ, నరసయ్య, శంకర్, ఉదయ్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.