మధిర లో ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు

Published: Thursday May 20, 2021

మధిర, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి.. సభను స్థానిక బోడేపూడి భవనం నందు నిర్వహించటం జరిగింది.. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం మధిర టౌన్ కార్యదర్శి శీలం నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య బాటలో నడవాలని సుందరయ్యను అందరూ psగా పిలుస్తారని తెలిపారు.. సుందరయ్య పేరు తెలియని. తెలుగు వారంటూ ఉండరు అని తెలిపారు ప్రజానాయకుడిగా ఆయన 1919, మే 1 జన్మించిన సుందరయ్య 1985 మే 19న మరణించారు.. ఈయన నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించి సుందరయ్య చిన్ననాటి నుండి ప్రజాస్వామ్య సమానత్వ భావాలను పుణికిపుచ్చుకున్నారు.. గాంధీ నాయకత్వంలో సాగుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడానికి పదిహేడు సంవత్సరాల వయసులోనే స్కూలుకు వదిలి అరెస్టయి రాజమండ్రి బోస్టన్ స్కూల్కు పంపబడ్డాడు. అక్కడే ఆయన కమ్యూనిస్టులు దళిత నాయకులను కలిశాడు.. విడుదలైన వెంటనే తన సొంత గ్రామం అలగానిపాడులో వ్యవసాయ కార్మికులను కూడగట్టి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కూలిరేట్లు తదితర హక్కుల కోసం పోరాటాలు చేసాడు.. తర్వాత అమీర్ హైదర్ ఖాన్ మార్గదర్శకత్వంలో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరాడు.. బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ పై నిషేధం విధించినప్పుడు అనేకమంది కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరే పనిచేయడం ప్రారంభించారు. సుందరయ్య అంత ర్రాష్ట్ర కాంగ్రెస్ ఫాసిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతను కామ్రేడ్ సుందరయ్య తీసుకున్నారు. ఆయన కృషి తానే అప్పటికే కేరళ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులుగా ఉన్న ఈఎంఎస్ నంబూద్రిపాద్ కృష్ణపిళ్ళే లాంటి ప్రముఖులంతా కమ్యూనిస్టులు గా మారారు.. 1946_51 కాలంలో ఐదు సంవత్సరాల పాటు సాగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణా సాయుధ పోరాటానికి కామ్రేడ్ సుందరయ్య ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. సాయుధ దళాలను నడిపించారు. ఆనాటి తెలంగాణాలోని ఫ్యూడల్ దోపిడీని పోరాటానికి దారితీసిన పరిస్థితులు నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని ఆ పోరాటంలో పడవ చూపిన పెడధోరణలు కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విబేధాలు వాటి మూలాలను సవివరంగా పేర్కొంటూ సుందరయ్య తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠం అనే మహా గ్రంథాన్ని రచించారు ఈ గ్రంథం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మంద సైదులు, టౌన్ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, పడకంటి మురళీ, వడ్రాణపు మధు, సిపిఎం నాయకులు వెంకట నర్సయ్య, వడ్త్య లాలూ, అమరయ్య, తదితరులు పాల్గొన్నారు...