మూగ జీవాలను విచక్షణ రహితంగా కొడుతున్నాడని కాళ్లు పట్టుకున్న కనికరించని సుబాబుల్ యజమాని

Published: Monday August 22, 2022

గిరిజన మహిళపై దాడి చేసిన వారిని శిక్షించాలి బోనకల్, ఆగస్టు 21 ప్రజా పాలన ప్రతినిధి: సుబాబుల్ పంట చేలోకి మేకలు గేదెలు వచ్చాయని కారణంతో మూగ జీవాలైన మేకను కొట్టి చంపి తమను అసభ్య పదజాలంతో తిడుతూ తమపై రావినూతలకు చెందిన ఐదుగురు వ్యక్తులు తమను కొట్టారని స్థానిక గిరిజన బాధితులు గుగులోతు రజిని, గుగులోత్ నాగులు తీవ్ర మనోవేదంతో పాత్రికేయులకు తెలిపారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం రజిని నాగులకు చెందిన మేకలు గేదెలు మేత మేసే క్రమంలో రావినూతల గ్రామానికి చెందిన వారి శుభాబుల్ పొలంలోకి వెళ్ళాయి. ఈ క్రమంలో ఆ పొలం యజమానులు తీవ్ర కోపంతో మూగ జీవాలను విచక్షణ రహితంగా కొట్టి ఒక మేకను అక్కడికక్కడే చంపేశారని, మరో మేకను కంటిలో కర్రతో పొడిచారని బాధితురాలు తన ఆవేదనను వ్యక్తపరిచింది. మూగ జీవాలను కొట్టవద్దని వారి కాళ్లు పట్టుకొని వేడుకోగా కనికరించకపోగా అసభ్య పదజాలంతో తిడుతూ మహిళపై చేయి చేసుకున్నారని బాధితురాలు వా పోయింది. ఇదే క్రమంలో మరొక బాధితుడైన గుగులోతు నాగులును సుబాబుల్ యజమానులు తీవ్ర పదజాలంతో దూషిస్తూ తల పగలగొట్టారని బాధితుడు తెలిపాడు. జరిగిన సంఘటనపై ఇది ఏమిటని ప్రశ్నించగా మూగ జీవాలను విచక్షణ రహితంగా కొట్టి ఒక మేకను చంపడమే కాకుండా తమను తిడుతూ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు గుగులోతు నాగులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.