పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపటమే లక్ష్యం : ఎమ్మెల్యే గాంధీ

Published: Tuesday July 27, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ లోని కొత్తగూడ గ్రామ కమ్యూనిటీ హాలు నందు అర్హులైన పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారిని బాల సరోజ, తహశీల్దార్ వంశీ మోహన్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్లు హైదర్ అలీ ఖాన్, శ్రీనివాస్, నారాయణ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను అర్హులైన పేద ప్రజలందరికి ఈ రోజు పంపిణి చెయ్యటం జరిగిందని, మన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అన్ని విధాలుగా కట్టుబడి ఉందని అన్నారు. మంజూరు అయిన కొత్త రేషన్ కార్డులను పేద ప్రజలకు పంపిణి చెయ్యటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం దిశగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చటం కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యటం జరిగిందని, ప్రతి సంక్షేమ పధకం పేద ప్రజలందరికి చివర వరకు అందేలా చర్యలు తీసుకోవటం వెనుక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. రాబోయే వారం రోజులు బాటు కొత్తగా మంజూరు అయిన రేషన్ కార్డులను పంపిణి కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నీలం రవీందర్ ముదిరాజ్, కోమిరిశెట్టి సాయిబాబా, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణగౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, చాంద్ పాషా, జంగం గౌడ్, నరసింహ సాగర్, శ్రీనివాస్ చౌదరి, రాజు యాదవ్, తిరుపతి యాదవ్, రవి గౌడ్, స్వామి సాగర్, రూప రెడ్డి, అడ్వకేట్ కృష్ణ వేణి, ప్రభాకర్, సత్యం గౌడ్, మంగమ్మ, గిరి గౌడ్, అబేద్ అలీ, మతిన్, ఉస్మాన్, ఎర్ర రాజు, రవి శంకర్ నాయక్, తాడెం మహేందర్, అశోక్ సాగర్, షేక్ రఫీ, నీలం లక్ష్మి నారాయణ, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, నీలం రామ్ ముదిరాజ్, కేశం కుమార్ ముదిరాజ్, మహ్మద్ ఖాసీం, హిమామ్ తదితరులు పాల్గొన్నారు.