రైతాంగ సమస్యలను పరిష్కారానికి దశలవారీ పోరాటం సిపిఎం బోనకల్

Published: Tuesday June 15, 2021
మధిర బోనకల్లు, జూన్14, ప్రజాపాలన ప్రతినిధి : రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారానికై దశల వారీ పోరాటాలు నిర్వహించనున్నట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు రైతు సంఘం నాయకులు, సీపీఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తెలియజేశారు దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోనకల్ మండలం తాసిల్దార్ కార్యాలయంలోని ఆర్ఐ జి.లక్ష్మణ రావు గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ నల్ల చట్టాలను రద్దు చేయాలని అదేవిధంగా శాస్త్రీయత ఆధారంగా ధరలు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సైతం రుణాలు ఇవ్వాలని, లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ,రైతులకు బ్యాంకు లో కొత్త రుణాలు ఇవ్వాలని, పట్టాదారు పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘము నాయకులు, కొమ్ముశ్రీను, తెల్లాకుల శ్రీనివాసరావు, కొంగర గోపీ గారు, ముక్కపాటి అప్పారావు mptc చెన్న లక్షద్రి, బండి పుల్లయ్య, sk.నాగులమీర, ఎసిపోగు బాబు, బొప్పాల రమేష్, బుక్యా జాలు, sk.నన్నేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.