మండలంలో హెల్త్ మేళాలు,వేసవి ఆరోగ్య రక్షణపై అవగాహన ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ సిద్ధం -దెందుకూరు పీహ

Published: Wednesday April 19, 2023
   మధిర, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణంలో పలు చోట్ల అవసరం ఐన చోట హెల్త్ మేళాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసి ప్రధమ చికిత్స సలహాలు తగిన మందులు ప్రజలకు పారా మెడికల్ సిబ్బంది ద్వారా అందజేస్తున్నట్లు డా. పృథ్వి చెప్పారు.మంగళవారం దెందుకూరు పిహెచ్సి లో మధిర ఎస్సి కాలనీలో మడుపల్లి బస్తి దవఖానలో మరియు మధిర లడక బజారు చివర బస్తిదవఖాన లో మహదేవపురం పల్లె దవఖాన లో, పారా మెడికల్ సిబ్బంది వివిధ గ్రామాల్లో వివిధ కూడళ్ల వద్ద ప్రజలను సమీకరించి మినీ వైద్య శిభిరంలు ఏర్పాటు చేసి తగిన చికిత్సచేసి చిరు
వ్యాదులకు చికిత్సతో పాటు ఆరోగ్య సూత్రాలు బోధించి పంపుతున్నారు.అదేవిధంగా డా. పృథ్వి ఆధ్వర్యంలో గర్భిణీ లు ప్రత్యేక క్యాంపు పెట్టి వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం హాస్పిటల్ కాన్పుకు ఏ విధంగా సిద్ధపడాలి అని చెప్పి, వారికి పరీక్షలు చేసి ఐరన్ కాలిష్యం మాత్రలు పంపణి చేసినారు.అదే విధంగా వడ దెబ్బ పై అవగాహన పరచి కావలసిన వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్స్ పారా మెడికల్ సిబ్బంది వద్ద అందు బాటు లో ఉంచాము అని తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో మధిర బస్తి దవఖాన డా. హేమలత, డా. సునీత మడుపల్లి ,పల్లె దవఖానా ఎమ్మెల్ హెచ్ పి ఐశ్వర్య, స్టాఫ్ నర్స్ భార్గవి, పిహెచ్సి స్టాఫ్ నర్స్ బృందం అనూష, రజిని , సృజన , ఫీల్డ్ సిబ్బంది పిహెచ్ఎన్ గోలి రమాదేవి హెచ్ఇఒ సనప, గోవింద్, హెచ్ఎస్ సుబ్బలక్ష్మి ,హెచ్ఎస్ లంకా కొండ య్య ,హెల్త్ విజిటర్ బి కౌసెల్య, ఎఎన్ఎమ్ లు జయమ్మ ,భారతి, విజయకుమారి , వై లక్ష్మి, రెండవ ఎఎన్ఎమ్ లు విజయ సునీలా ,నాగమణి ,రాజేశ్వరి ,అరుణ , జె విజయలక్ష్మి, లీల హెచ్ఎ లు నాగేశ్వరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.