పెంచిన బస్ పాస్ ఛార్జ్ లను వెంటనే తగ్గించాలని

Published: Thursday June 16, 2022
మంచిర్యాల టౌన్, జూన్  15, ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను వెంటనే తగ్గించాలని కోరుతూ బుధవారం రోజు మంచిర్యాల బస్ డిపో ముందు ఎన్ యస్ యు ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు  మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ సెస్ అని విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను 3రేట్లు పెంచి విద్యార్థులను చదువుకు దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు.ప్రతి గ్రామంలో హైస్కూల్, మండలంలో ఇంటర్ కాలేజీ, నియోజకవర్గం లో పీజీ కాలేజీ లను నిర్మించకుండా పేద విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకుందాం అంటే అమాంతం బస్ పాస్ రేట్లను పెంచడం సిగ్గుచేటని,  పెను భారంగా బస్ ఛార్జ్ లను పెంచడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 165 రూ నుండి 450రూ పెంచిన విద్యార్థుల బస్ పాస్ ల రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  నాయకులు శివ ప్రసాద్, సూరజ్,శివ నాని, టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏల్పుల రోహిత్,యూత్ నాయకులు ప్రదీప్, ఎన్ ఎస్ యు ఐ బెల్లంపల్లి మండల ఉపాధ్యక్షుడు చిలుముల సాయికుమార్, రోషన్,ఉమేష్, నవీన్, ప్రణయ్, రాజమౌగిలి, సాయి కిరణ్, వెంకట్, జశ్వంత్,సాయి కిరణ్, సురేష్, వినయ్,టింకు,సుశాంత్,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.