చేపల చెరువు విషయంలో మాపై వచ్చిన ఆరోపణలు అసత్య ఆరోపణలు మాత్రమే

Published: Wednesday May 18, 2022
మత్స్యశాఖ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జ్వాలా స్వామి, నాగరాజు
 
బోనకల్, మే 17 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో గల మత్స్యశాఖ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జ్వాల స్వామి, గోగుల నాగరాజు మా గ్రామానికి చెందిన కటారి నాగేశ్వరరావు,చావా రాధాకృష్ణ అనే రైతుల పొలం మధ్యలో నాలుగు అడుగుల లోతు, ఆరు అడుగుల వెడల్పుతో అక్రమంగా కాలువ తవ్వి, అర్థ రాత్రి సమయంలో నీళ్ళు వదీలామని ఆ ఇద్దరు రైతులు కలిసి కలెక్టర్ కి మాపై పిర్యాదు చేసినట్లు పలు పత్రికలలో వచ్చిన వార్త కథనాలు అసత్య ఆరోపణలు మాత్రమేనని,చిరునోముల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా చెరువు కట్టకు అనుకొని ఉన్న కాలువను పూడిక తీయడం మాత్రమే జరిగింది. కటారి నాగేశ్వరరావు, చావా రాధాకృష్ణ రైతులు యొక్క పొలం మధ్యలో నుంచి కాలువ త్రవ్వినట్లు అయితే అట్టి రైతుల యొక్క భూములను రెవెన్యూ అధికారులు ద్వారా సర్వే చేయించి,మేముపూడిక తీసిన చెరువు కట్టకు అనుకోని ఉన్న కాలువ అక్రమమో కాదో అధికారులే నిజ నిజాలు తేల్చాలని మత్స్యశాఖ సొసైటీ సంఘం తరఫున అధికారులను కోరుతున్నాము.చేపల చెరువుకు సంఘం తరుపు నుంచి 15 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టీ ఉన్నామని వర్షాలు అధికంగా కురిస్తే చెరువు కట్ట తెగి చేపలు కొట్టుకుని పోతే మాకు అధిక నష్టం వాటిల్లడమే కాక దాన్ని నమ్ముకొని ఉన్న మాకుటుంబాలు రోడ్డున పడుతాయనీ తెలియజేస్తున్నాము. కావున అధికారులు పరిశీలించి నిజానిజాలు తెలియజేయాలని కోరుతున్నాము.