ఘనంగా కుంభం జన్మదిన వేడుకలు

Published: Tuesday February 09, 2021

వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ప్రముఖ పారిశ్రామిక వేత్త కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రేస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కేకు కత్తిరించి,శుభాకాంక్షలు తెలిపి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజు,మాజీ పిఎసిఎస్ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి,సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి,కంకల కిష్టయ్య నాయకులు కుంభం వెంకటపాపిరెడ్డి,పాలకూర్ల వెంకటేశం,బత్తిని సహదేవ,కాసుల వెంకన్న,సతీష్,నరేందర్,ఎమ్మె లచ్చయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.