రాయిని చెరువులోకి రసాయన వ్యర్థ జలాలు

Published: Friday July 23, 2021

-పరిశ్రమల పై చర్యలకు జిన్నారం గ్రామ పాలకవర్గం డిమాండ్
జిన్నారం గ్రామంలోని రాయిని చెరువును కాలుష్య జలాలు ముంచెత్తాయని, గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపు లేని వర్షాలను పలు పరిశ్రమలు అనుకూలంగా మార్చుకున్నాయి జిన్నారం గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రాయిని చెరువులోకి  వ్యర్థ రసాయన జలాలను వర్షం నీటి ద్వారా పలు పరిశ్రమలు వదులుతున్నాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు జిన్నారం పాలకవర్గ సభ్యులు చెరువును పరిశీలించగా చెరువులో నీరు కాలుష్యమయంగా మారిందని చెరువు పైభాగాన ఉన్న విర్కో, గ్రానుల్స్, మెట్రో కేం,న్యూ ల్యాండ్ పరిశ్రమల నుండి కాలుష్య వ్యర్ధ జలాలను చెరువులోకి వదులుతున్నారని, జిన్నారం మండలంలోనే అతిపెద్ద చెరువు రాయిని చెరువు పరిశ్రమ వ్యర్థ జలాలతో పూర్తిగా కాలుష్యంగా మారుతోందని రాయిని చెరువు కింద సుమారు వేయి ఎకరాల మేర సాగు భూమి సాగు జరుగుతుంది కాలుష్య జలాలతో రైతులు, చెరువులో చేపలు చనిపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని జిన్నారం పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు ఇకనైనా అధికారులు విచారణ జరిపించాలని వెంటనే కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చొరవ తీసుకుని సమస్యను గుర్తించి పరిశ్రమల పైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.