ఘనంగా ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ జన్మదిన వేడుకలు

Published: Tuesday December 20, 2022
జన్నారం, డిసెంబర్ 19, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీనా రేఖనాయక్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల ఎఆర్ఎస్ కళాశాల ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుల్వ జనార్ధన్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, పొన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, జన్నారం ఎంపీటీసీ రియాజుద్దీన్, జన్నారం సర్పంచ్ భూషణవేని గంగాధర్ గౌడ్, నాయకులు భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.