SFI ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్థంతి వేడుకలు..

Published: Wednesday March 24, 2021
నేడు భారత విప్లవ యువ వీరకిశోరాలు భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 90వ వర్థంతి
మధిర, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి : భారత్ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి విరోచితంగా పోరాడిన యోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వీరిని 1931 మార్చి 23 న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన స్వతంత్ర సంగ్రామాన్ని విజయపంధా వైపు నడిపిన అమరవీరులకు SFI మధిర బోడెపూడి భవన్ ఆధ్వర్యం లో పూలమాలవేసి SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు అన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:- మన దేశాన్ని, రాజ్యాంగాన్ని మతోన్మాద శక్తుల దాడుల నుండి పరిరక్షించుకుని సమైక్య ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా కదలాలని ఈ సందర్భంగా ప్రతిన పూనుదాం... ఆధునిక, సమైక్య భారతదేశాన్ని నిర్మించుకునే కృషికి బీజం వేసినవాడు భగత్‌సింగ్‌. ఆర్థిక దాడులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను, లౌకిక ప్రజాతంత్ర పునాదులను పరిరక్షించుకునే పోరాటాలను మిళితం చేయాలి. ఈ పోరాటాలు ప్రజల రాజకీయ స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించే దిశగా కూడా సాగాలి. అందుకోసం ప్రజల సమైక్యతను, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలునిచ్చారు... ఈ కార్యక్రమంలో గణేశ్, పేరు స్వామి, రాజేష్, వెంకట, సాయి, సూర్య, లిఖిత, తదితరులు పాల్గొన్నారు