ముద్దసాని జన్మదిన వేడుకలు

Published: Friday May 07, 2021

వలిగొండ ప్రజాపాలన మండల పరిధిలోని మొగిలిపాక గ్రామానికి చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నర్సింహ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి జన్మదినం సందర్భముగా గ్రామంలో అభిమానులు కేకు కత్తిరించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి గ్రామంలోని వృద్ధులకు సుమారుగా 80 మందికి చేతి కర్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు భీమనబోయిన భిక్షపతి, ఉపసర్పంచ్ భీమనబోయిన నర్సింహ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ జడిగె భిక్షపతి నాయకులు మొగిలిపాక రమేష్, విష్ణుచారి, రవీందర్, సత్యరాములు, నవీన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.