సిపిఐ పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ బెల్లంపల్లి నియోజ

Published: Tuesday December 27, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పుట్టిందే బడుగు, బలహీన వర్గాల, పేద ప్రజల కోసమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్, రేగుంట చంద్రశేఖర్, లు అన్నారు.
సోమవారం సిపిఐ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని  పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి, జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడారు, దున్నేవాడిదే భూమి అనే  నినాదంతో ఆవిర్భవించిన పార్టీ గత 98 సంవత్సరాలుగా, అనునిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ, పార్టీ, మరియు ప్రజా సంఘాల ద్వారా కార్మికుల, కర్షకుల, హక్కుల కోసం,  పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు చిప్ప నరసయ్య, బొల్లంపూర్నిమ,  పట్టణ కార్యదర్శి డి ఆర్ శ్రీధర్, జిల్లా సమితి సభ్యులు బొంతల  లక్ష్మీనారాయణ, గుండా చంద్ర మాణిక్యం, ఆడెపు రాజమౌళి, ఎల్తూరి శంకర్, అమృత, సోనియా, తదితరులు పాల్గొన్నారు.