"ఆత్మహత్యలు వద్దు","పోరాటాలే ముద్దు"

Published: Friday April 16, 2021

ప్లే కార్డులతో డివైఎఫ్ఐ నాయకుల నిరసన
ఆసిఫాబాద్ జిల్లా మార్చి14 (ప్రజాపాలన ప్రతినిధి):  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, "ఆత్మహత్యలు వద్దు", "పోరాటాలే ముద్దు" అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 వ జయంతి పురస్కరించుకొని బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు ప్లే కార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని, కేంద్రంలో ఆయా శాఖల లో కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,  వాటిని భర్తీ చేయకుండా మాయ మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇంటికి కో ఉద్యోగం తో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కెసిఆర్ మాయమాటలు చెప్పి ఇప్పటివరకు ఆయా శాఖలలో పోస్టులను భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత అనేక ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ యువతను కలుపుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సహాయ కార్యదర్శి ఆర్ కె, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొర్కుటే  శ్యామ్ రావు, నాయకులు దుర్గం నిఖిల్, శివ కుమార్, శంకర్,  హేమాజీ, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.