దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య సమీక్ష

Published: Friday July 01, 2022
హైదరాబాద్ 30 జూన్ ప్రజాపాలన: 
దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.మహేందర్ 
ఆద్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ  సమీక్ష నిర్వహించారని డాక్టర్.కిషోర్ తాల్క తెలియజేశారు.
 
జనగాం జిల్లా దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.మహేందర్ మరియు అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్.కరుణశ్రీ, ప్రోగ్రాం ఆఫీసర్ ల తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాల సమీక్ష బుధవారం నాడు నిర్వహించడం జరిగిందన్నారు. 
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.మహేందర్ మాట్లాడుతూ 
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇంకా కృషి చేయాలని సూచించారు. సమయ పాలన పాటిస్తూ ఎల్లపుడూ ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలాగా వైద్య సిబ్బంది పని చేయాలని సూచించారు. పనిలో అలసత్వం వహిస్తే కఠిన  చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.ఒ. సి .హెచ్.ఐ (చైల్డ్ హెల్త్ మరియు ఇమ్మునైజేషన్) డాక్టర్.రాము డాక్టర్.అశోక్ పిఒ- ఎన్టిఇ పి( జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన)
డాక్టర్.భాస్కర్ పిఒ- ఎన్ సిడి (అసంక్రమిత వ్యాధులు) దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 
డాక్టర్.కిశోర్ కుమార్ తాల్క మండల వైద్యాధికారి
సి.హెచ్.ఒ- వెంకటస్వామి
హెల్త్ సూపర్వైజర్ - సత్యనారయణ 
భాగ్యమ్మ- హెచ్ వి 
ఏ.ఎన్.ఎమ్ , ఆశా వర్కర్లు  తదితర సిబ్బంది పాల్గొన్నారు.