భూర్గంపహాడ్ మండలం మోతెపట్టినగర్ గ్రామ పంచాయతీ ఎస్సి సెల్ బి. ఆర్. ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్న

Published: Tuesday November 22, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గౌ:శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు..
భూర్గంపహాడ్ మండలం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు  వలదాస్ సాలయ్య  అధ్యక్షతన.
ముఖ్య అతిధిలు పినపాక నియోజకవర్గం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్  అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  మరియు పినపాక నియోజకవర్గం సీనియర్ నాయకులు బి. ఆర్. ఎస్ పార్టీ పరిశీలుకులు తడికమళ్ళ ప్రభుదాస్ గారు ఆధ్వర్యంలో
భూర్గంపహాడ్ మండలం మోతెపట్టినగర్ గ్రామ పంచాయతీ ఎస్సి సెల్ గ్రామశాఖ అధ్యక్షులుగా ఇనపల్లి వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శిగా దాసరి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా దాసరి ఆనంద్ కుమార్ , చెలకాని శివ గార్లలను,   ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
అదేవిధంగా పినపాక నియోజకవర్గం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్   ఈ సందర్బంగా మాట్లాడుతూ
సొంతింటి కల కూడా అతి త్వరలో నెరవేరుస్తుందని,  ప్రతి పేదవాడికీ సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికీ 3 లక్షలు రూపాయలు హార్దికసహాయం అతి త్వరలో అమలు అవుతుంది అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దళితులు పట్ల అంకిత భావంతో దళిత బందు పధకం ప్రవేశ పెట్టి 10 లక్షలు రూపాయలు ఇచ్చి దళితులు ఆర్ధికంగా వెనకబడకుండా ఉండాలనికీ దోహదం చేశారు అన్నారు .అదే విధంగా దేశంలో ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేని అనేక సంక్షేమ పథకాలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్,రైతు బందు, రైతుభీమా, 57సంవత్సరాలు నిండిన వారికీ పింఛన్, కెసిఆర్ కిట్టు, మిషన్ కాకతీయ, ఒంటరి మహిళ పింఛన్, 24 గంటలు కరెంట్  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉందన్నారు..