వృద్ధులు దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల ఎంపిక గుర్తింపు శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్

Published: Tuesday June 21, 2022
మేడిపల్లి, జూన్20 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని రామంతాపూర్ గాంధీనగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో 
 ఆలింకో సంస్థ హైదరాబాద్  సమన్వయంతో, జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు ) సీనియర్ సిటిజన్లకు ఉచిత పరికరాలు ఉపకరణములు మరియు కృత్రిమ అవయవాల ఎంపిక గుర్తింపు శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి, కార్పొరేటర్లు బండారు శ్రీవాణి వెంకట్రావు, రజిత పరమేశ్వర్ రెడ్డి, చేతన హరీష్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ గంధం జోష్న నాగేశ్వరరావులతో కలిసి శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధులు ఆయా దివ్యాంగులను పరీక్షించే సంబంధిత డాక్టర్లు, టెక్నీషియన్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్ఫాల్ రెడ్డి,  టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.