యాదాద్రి ఆలయ గోపురానికి విరాళాలను మేయర్ జక్క వెంకటరెడ్డికి అందజేసిన టీఆర్ఎస్ నాయకులు బండి

Published: Friday October 29, 2021
మేడిపల్లి, అక్టోబర్28 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం 125 కిలోల బంగారం అవసరం అవుతుందని, అందుకు తెలంగాణ ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ విరాళాలు సేకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచించారు. అందుకు అనుగుణంగా మేడ్చల్ శాసనసభ్యులు మరియు కార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్లోని గణేష్ నగర్ కాలనీ. శ్రీపాద కాలనీ. విష్ణుపురి ఎన్ క్లూ కాలనీ వాసుల నుండి సేకరించిన విరాళాలను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండి సతీష్ గౌడ్, ఆయా కాలనీల పెద్దలు మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి మరియు డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ కు 42.116 రూపాయల నగదును అందజేశారు.