మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Published: Saturday October 02, 2021
డిఆర్డిఓ క్రిష్ణన్, ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 01 అక్టోబర్ ప్రజాపాలన : మొక్కలు నాటే లక్ష్యాన్ని త్వరరగా పూర్తి చేయాలని డిఆర్డిఓ క్రిష్ణన్ ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ లు తెలిపారు. శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన రావులపల్లి గ్రామాన్ని సందర్శించి, గ్రామ సర్పంచ్ దేవమ్మ అబ్రహామ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈరోజు వరకు 25 వేల వరకు మొక్కలు నాటడం అభినందనీయమని కొనియాడారు. ఇంకా 6 వేల మొక్కలను త్వరగా నాటాలని సూచించారు. మొక్కలకు నీరందించుటకు ఒక బోరుబావిని మంజూరు చేయాలని కోరారని వివరించారు. ట్యాంకర్ తో నీళ్ళు పోయించడానికి లక్షా పదకొండువేల రూపాయలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి ఎంపిపి భట్టు లలిత రమేష్, ఎంపిటిసి రవీందర్, కో ఆప్షన్ మెంబర్ సోహేల్, ఎంపిఓ సోమలింగం, ఏపిఒ అంజి రెడ్డి, కార్య దర్శి స్వప్న రవి, శ్రీశైలం, టిఏ వెంకటేష్, బలవంత రెడ్డి, విష్ణు, భాస్కర్ తదితరులు పాల్గున్నారు.