శితిలావస్థలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం

Published: Thursday December 02, 2021
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్01, ప్రజాపాలన : శితిలావస్థలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ఉందని, నూతన భవనానికి స్థానిక ఎమ్మెల్యే నిధులు విడుదల చేయాలని కళాశాలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో  లక్షేట్టి పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రదానంగా కళాశాల భవనం పూర్తిగా శితిలావస్థలో  చేరుకుందని,. దింతో తరగతి గదుల్లో స్లాబ్ పై పెచ్చులు ఉడిపోవడంతో విద్యార్థులు వేరే గదుల్లో కూర్చుంటున్నారని అన్నారు. ప్రస్తుతం ఒకేషనల్ చదువుకునే విద్యార్థులకు ఈటీ,ఎలక్ట్రానిక్ ప్రాక్టికల్ చేయించే పరికరాలు పనిచేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్, అవినాష్, విష్ణు, తరుణ్, అఖిల్, మనోహర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు..