జాతీయ పార్టీ ప్రకటన పై దెందుకూరులో ఘనంగా సంబరాలు.మధిర రూరల్

Published: Friday October 07, 2022
అక్టోబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీ ప్రకటనపై ఆనందోత్సవం సంబరాలు
జోరు వానను సైతం లెక్కచేయకుండా ఉప్పొంగిన ఉత్సాహంతో సంబరాలు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలు.బాణసంచాలు పేల్చి, డప్పల వాయిద్యాలతో గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ పార్టీ *బిఆర్ఎస్* ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా  సంబరాలు జరుగుతున్న వేళ మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఆ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా *బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* చేశారు. దేశ్ కి నేత కేసిఆర్ అని,దేశానికి కాబోయే ప్రధాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడుతూ జోరు వానలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణ సంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా రైతు బంధు సభ్యులు చుంచు విజయ్ కుమార్ గ్రామ శాఖ అధ్యక్షుడు అమెరినేని వెంకటేశ్వరావ్ కార్యదర్శి ఉద్దండు, , రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కోట రాజేంద్రప్రసాద్, కొల్లూరి శ్రీనివాసరావు గుర్రం భాస్కరరావు ఎంపీటీసీ అల్లు రమాదేవి అంకబాబు గుర్రం వీరయ్య చౌదరి గాలిబ్ సరిపోయిన సత్యం, వార్డు సభ్యులు అగర్ల మాధవరావు కందుకూరు నాగబాబు పగిడిపల్లి రాములు విద్యా కమిటీ చైర్మన్ బోసేట్టి గోపాలరావు, మురళి, సురేష్ దుగ్గంపూడి కమలాకర్, దుగ్గినేని ప్రవీణ్, చెరుకూరి వాసు ఆదిమూలం కిషోర్. ఈదల కృష్ణ, చల్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు