సీఎం సహాయనిధి నుండి 60 వేల చెక్కును అందిస్తున్న డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్

Published: Saturday June 19, 2021

మేడిపల్లి, జూన్18, ప్రజాపాలన ప్రతినిధి : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసముంటున్న వి.సక్కుబాయ్ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుండి కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి సహకారంతో నగర డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ 60 వేల రూపాయలను మంజూరు చేయించారు. సీఎం సహాయనిధి నుండి మంజూరైన 60 వేల చెక్కును మంత్రి చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గ దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు