నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి

Published: Wednesday August 11, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి ఆగస్టు (10) భారతీయ జనతా యువమోర్చ బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలు భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 31నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనగా బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి అమరేందర్ మండల కేంద్రంలో బూట్ పాలిష్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మండల సీనియర్ నాయకులు దంతూరి సత్తయ్య, రాచకొండ కృష్ణ, మైసోళ్ళ  మత్స్యగిరి, బచ్చు శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.