లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday May 13, 2021
వికారాబాద్ మే 12 ప్రజాపాలన బ్యూరో : ​పలు వ్యాపార దుకాణాలలో ఎక్కువ మంది గుమి కూడవద్దని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఉదయం 10 గంటల నుండి లాక్ డౌన్ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాా కేంద్రంలో కాలినడకన తిరుగుతూ పలు వ్యాపార దుకాణాలను రైతు బజార్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేే మాట్లాడుతూ రైతు బజార్ లో ఎక్కడ వేసిన చెత్త అక్కడేే ఉండడం తీవ్రర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన కూరగాయలు అక్కడే ఉండడం చూసి అవాక్కయ్యారు. ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రం చేయించాలని మున్సిపల్ కమీషనర్ బుచ్చయ్య బుచ్చయ్యను మార్కెట్ కమిటీ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా గుమి కూడ కుండ ఉండడానికి రైతు బజార్ లోనే ఖాళీగా ఉన్న షెడ్డులో కూర్చోవచ్చని అమ్మకం దారులకు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ కు వ్యాపారస్తులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కౌన్సిలర్ కృష్ణ, నాయకులు రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.