కెవి రమేష్ రాజు పెళ్లిరోజు సందర్భంగా మాతా పితరుల సేవాసదనంలో అన్నదాన కార్యక్రమం*

Published: Thursday August 18, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 17ప్రజాపాలన ప్రతినిధి

బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లయన్ కె వి రమేష్ రాజు వివాహ వార్షికోత్సవ సందర్భంగా  ఇబ్రహీంపట్నం మాతా పితరుల సేవాసదనం ఉచిత వృద్ధాశ్రమములో నిరాదారులు,నిరాశ్రయులైన వృద్ధులకు కెవి . రమేష్ రాజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం, కిరాణా సామాగ్రి మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెవి రమేష్ రాజు మాట్లాడుతూ తల్లిదండ్రులను దైవంగా భావించడం మన భారతీయ సంస్కృతి నేడు సంపాదనే ధ్యేయంగా తన సంసారమే లోకమై , వృద్ధులైన తల్లిదండ్రులను వీధిపాలు చేస్తున్న నేటి సమాజం ప్రేమ, ఆప్యాయత, జాలి, కరుణకు బదులు స్వార్థం, వంచన, పగ, ప్రతీకారం మనిషి జీవితాన్ని కబలిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల పోషణ భారంగా భావిస్తున్న తరుణంలో వయోవృద్ధులైన తల్లిదండ్రులను వదులుకోవడానికి వెనుకాడడం లేదంటే ఇది ఎంతటి దురదృష్టకరమో అర్థమవుతుందని అన్నారు . దానం చేసే చేతుల కన్నా ఆత్మీయతతో స్పృశించే చేతులు మిన్న అనిఅన్నారు . ఎవరి హృదయం దయాపూరితమో ఎవరి పలుకులు సత్యభూతాలో ఎవరి దేహం పరహితైక ప్రయోజనమో అట్టివారిని కలి ఏమి చేయజాలదని తెలిపారు. మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా మాతా పితరుల సేవా సదనంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారి ఆశీస్సులు తీసుకోవడంలో ఉన్న సంతోషం మరి ఎక్కడ వెతికిన దొరకలేదని సంతోష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ మహేష్ గౌడ్ , లయన్ అశోక్ కుమార్ , లయన్ పసునూరి వినోద్ , తెరాస ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాలరావు , ఆశ్రమమునందలి వృద్ధులు , కెవి రమేష్ రాజ్ కుటుంబ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు .