తనదైన శైలిలో ఆర్థిక సహాయం అందజేస్తున్న జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్

Published: Tuesday June 21, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 20 ప్రజాపాలన ప్రతినిధి. ఈరోజు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో ఉప్పల  చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న 50 పూర్తి ఇండ్ల నిర్మాణలలో భాగంగా ఈరోజు ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చెందిన  అయిల్ పార్వతమ్మ భర్త కీర్తిశేషులు ఆయిల్ పాండయ్య గౌడ్ ఇంటి  స్లాబ్ ఈరోజు వేయించడం జరిగింది  పూర్తి ఇంటి నిర్మాణంలో భాగంగా తన ట్రస్ట్ ద్వారా స్టీల్ , సిమెంట్, ఇసుక తదితర ఇంటి నిర్మాణ సామాగ్రిని అందజేసిన  తలకొండపల్లి ZPTC ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, శ్రీ ఉప్పల వెంకటేష్  . ఈ సందర్భంగా ఇళ్ళు లేని నిరుపేద కుటుంబానికి చెందిన ఆయిల్ పార్వతమ్మ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలిపినారు.
       ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ మల్లె కేడి అంబాజీ గ్రామ ఉప సర్పంచ్ అజిజ్, మాజీ ఉప సర్పంచ్ బోయ  నర్సింలు నాయకులు తిరుమణి లచ్చయ్య గౌడ్. లకు మల్ల మల్లేష్ .తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం
కోరంతకుంట తాండ  గ్రామ పంచాయతీకి  చెందిన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ  రాత్రి రామావత్  వశ్య మరణించడం జరిగింది. ఈ విషయం స్థానిక నాయకుల తెలుసుకున్న   

*తలకొండపల్లి ZPTC, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ , ఉప్పల వెంకటేష్ *

మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తన ట్రస్ట్ ద్వారా 3,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి తన అనుచరుల ద్వారా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రవి నాయక్ సక్రు  భీమ  శ్రీను సర్పంచ్ రాము నాయక్ ఉప సర్పంచ్ రమేష్ నాయక్ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.