నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం విరాళం అందజేసి

Published: Friday June 24, 2022
పాలేరు జూన్ 23 ప్రజాపాలన ప్రతినిధి
.నేలకొండపల్లి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయంలో పేద విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాల కోసం  రిటైర్డ్ టీచర్  కర్నాటి శంకర్రావు  వారి శ్రీమతి కమల   జ్ఞాపకార్థం ఒక   లక్ష రూపాయల చెక్కును   గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్   ఆలేటి పరంజ్యోతి కు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా దాత కర్నాటి  శంకర్ రావు మాట్లాడుతూ  ఈ ప్రాంతంలో చదువుతున్న పేద బడుగు విద్యార్థుల చదువుల కోసం అవసరమైన  డిగ్రీ పుస్తకాలతో పాటు వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను కొనుగోలు చేసేందుకు తమ వంతు ఉడతాభక్తిగా   లక్ష రూపాయలు   అందించినట్లు చెప్పారు.తమ ఆర్థిక సహాయంతో పేద విద్యార్థులు గ్రంథాలయంలో  ఉంచిన పుస్తకా లు చదివి    ఉన్నత స్థానాలకు చేరితే తమకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదని వారు అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుల కోసం విలువైన పుస్తకాలు అందించిన కర్నాటి శంకర్రావు  దాతృత్వం గొప్పదని   విద్యార్థులు అధ్యాపకులు తరపున  వారికి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ కళాశాల అభివృద్ధికి సహకరిస్తే విద్యార్థులను    ఉన్నత స్థానాలకు చేరుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ సందర్భగా దాత శంకర్ రావును  ను శాలువాతో  ప్రిన్సిపాల్ అధ్యాపకులు  సత్కరించారు  కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎన్ మాధవరావు ch.శ్రీనివాస్ , జానకిరామారావు, కోటమ్మ, కవిత  ఎస్ఎం రఫి ,డాక్టర్ వెంకటరాజం,పద్మలత,రిటైర్డ్ లెక్చరర్ సాధు రవాణా రాధాకృష్ణమూర్తి లు పాల్గొన్నారు