బనిగండ్లపాడు గ్రామంలో గల వివేకానంద పాఠశాల నందు బతుకమ్మ వేడుకలు

Published: Wednesday October 06, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : పాఠశాల హెచ్ఎం బుజ్జి బాబు ఆధ్వర్యంలో వివేకానంద స్కూలు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం బుజ్జి బాబు మాట్లాడుతూ ఈ మాసం బతుకమ్మ మాసం కాబట్టి రేపటి నుంచి ఈ పాఠశాలలకు సెలవులు వచ్చిన సందర్భంలో, అందులో బతుకమ్మ మాసం కాబట్టి పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాజిత్, భూలక్ష్మి, ఆదిలక్ష్మి, మౌనిక, స్వాతి, మరియు టీచింగ్ నాన్-టీచింగ్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.