2251 లబ్దిదారులకు 63.40 కోట్లు రుణం మంజూరు

Published: Tuesday October 26, 2021
ఎస్ఎల్ బిసి తెలంగాణ కన్వీనర్ కిషన్ శర్మ
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజాపాలన : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ తరువాత వికారాబాద్ జిల్లాలో ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎల్ బిసి తెలంగాణ కన్వీనర్ కిషన్ శర్మ అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలో 2251 లబ్ధిదారులకు రూ.63 కోట్ల 40 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాలులో ఋణ విస్తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకిషన్ శర్మ మాట్లాడుతూ ప్రజలు బ్యాంకులు అందించే ఋణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ది పొందాలని సూచించారు. వివిధ బ్యాంకుల ద్వారా మహిళా గ్రూప్ సభ్యులకు, రైతులకు, వ్యాపార వేత్తలతో పాటు కార్ లోన్లు, వ్యక్తిగత లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు.  రుణాలు పొందిన లబ్ధిదారులు సక్రమంగా వాయిదాలను చెల్లించి మరిన్ని ఋణ సదుపాయాలు పొందవచ్చని సూచించారు. అన్ని బ్యాంకులు కలసి ఋణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.  గత వారం రోజులలో 27 బ్యాంకుల ద్వారా 1.7 కోట్ల రూపాయల గృహ, పంట రుణాలు అందించడం జరిగిందని తెలియజేసినారు. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. తీసుకున్న రుణాల వాయిదాలను సక్రమంగా చెల్లించే వారికి బ్యాంకర్లు మళ్ళీ అవకాశాలు కల్పిస్తాయని సూచించారు. ఈ సందర్బంగా DRDA కృష్ణన్ మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతో ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అండేటట్లు కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత సంవత్సరం 300 కోట్ల ఋణ లక్ష్యం కాగా 100 శాంతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 360 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 160 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని, మిగితా లక్ష్యం బ్యాంకర్ల సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్బంగా DRDA ద్వారా ఎంపికైన SHG మహిళా గ్రూప్ సభ్యులకు 15 కోట్ల ఋణ చెక్కును అందించగా, మెప్మా ద్వారా లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 12 లక్షల చెక్కును SHG గ్రూప్ సభ్యులకు అందించడం జరిగినది. పెద్దముల్ గ్రూప్ సభ్యులకు 75 లక్షలు, SBI నుండి ఫింక్షన్ హాల్ కొరము రూ. 3 కోట్లు, వివిధ స్కీం ల క్రింద కార్ లోన్ వ్యక్తి గత లోన్లు మంజూరు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో SBI DGM దిబశిష్ మీశ్రా, SBI RM శ్రీధర్ బాపూజీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ సయ్యద్ యూసఫ్, HDCCB DGM కిరణ్ కుమార్, ED SC కార్పొరేషన్ బాబు మొజెస్ లతో పాటు తొమ్మిది వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.