మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాలి

Published: Friday November 26, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 25 (ప్రజాపాలన) : మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాలని వారి కోసం ఉన్న రక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో గురువారం సఖి సెంటర్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవమునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండడంతో పాటు వాటి ద్వారా తమను తాము రక్షించుకోవాలన్నారు. మహిళలపై గతంలో పోల్చితే వేధింపులు కొంత తగ్గాయని, అయితే ఇది పూర్తిగా తగ్గాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వేధింపులను నిరోధించడానికి ఉల్లంఘన దినోత్సవం పేరట వారం రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్వహించాలని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీమహాత్ముడు చెప్పిన మాటలు ఇంకా నిజం లేదని, చెప్పడానికి నిదర్శనమే ఉల్లంఘన దినోత్సవం జరుపుకోవడం అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకు వచ్చిన చట్టాలు కొంత మంది ఉపయోగించుకుంటున్నారని, వాటిని దుర్వినియోగం చేయకూడదంటున్నారు. కళాశాల కు వచ్చిన కలెక్టర్ కు విద్యార్థులు ఘనస్వాగతం చెప్పి, వారు చేసిన దృశ్యం అలరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సావిత్రి, గిరిజన సంక్షేమ శాఖ అధికారిని మన్నెమ్మ, జిసిడిఓ శకుంతల, సఖి నిర్వాహకురాలు సౌజన్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, శారద, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.