బతుకమ్మ చీరల పంపిణీ

Published: Tuesday September 20, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 19, ప్రజాపాలన : బతుకమ్మ చీరల పంపిణీ
లక్షెట్టిపేట మున్సిపాలిటీలో, మోదెల, ఉత్కూర్,గంపలపల్లి,ఇటిక్యాల్ , లక్షెట్టిపేట మండలం లోని పోతేపల్లి,అంకత్ పల్లి,లక్ష్మీపూర్, గుళ్లకోట,సూరారం, మిట్టపల్లి,గ్రామాలలో   కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేశారు. అనంతరం సురేఖ మాట్లాడుతూ  ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.