కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Published: Thursday February 17, 2022
బోనకల్, ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆదేశానుసారం బోనకల్ మండల కేంద్రంలోని  వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం టిఆర్ఎస్ బోనకల్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, వెనిగండ్ల మురళి, టిఆర్ఎస్ బోనకల్ గ్రామ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, తెళ్లూరి రమేష్, జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, బోనకల్ సహకార సంఘం డైరెక్టర్ భూక్యా సైదులు, కొనకంచి నాగరాజు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.