ఆనందోత్సవాల మధ్య హోలీ వేడుకలు

Published: Monday March 29, 2021
హోలీ వేడుకల్లో పాల్గొన్న మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అవ్వా విజయలక్ష్మి వార్డు కౌన్సిలర్ ద్వారావతి మాధవి
మధిర, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి : మధిర లో హోలీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరూ రహదారులపై వచ్చి రంగులు పూసుకుని కేరింతలు కొట్టారు. మధిర లడక బజారులో జరిగిన హోలీ వేడుకల్లో న్యాయవాది రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉపాధ్యక్షులు అవ్వా విజయలక్ష్మి పాల్గొని కేరింతలు కొట్టారు అనంతరం 19 వార్డు కౌన్సిలర్ మాధవి ఆ వార్డులో ఉన్న మహిళలతో ఘనంగా హోలీ పండుగ జరుపు  కున్నారు అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు చైర్మన్లు కౌన్సిలర్లు మధిర లో హోలీ పాటలు వారి వారి ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటారు ఈ హోళీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హరి కోరుకున్నారు