ఆర్థిక సహాయం అందించిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు - గుడి రఘుపతి రెడ్డి

Published: Tuesday August 03, 2021
కొడిమ్యాల, ఆగస్టు 02. (ప్రజాపాలన ప్రతినిధి) : నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఆగస్టు లో 12 రోజులు జరిగే కబడ్డీ కోచ్ శిక్షణ శిబిరానికి కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు గుమ్మడి శ్రీనివాస్ ఎంపికయ్యారు. గుమ్మడి శ్రీనివాస్ ను రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి ఘనంగా సన్మానించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గుడి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కబడ్డీ విభాగంలో శ్రీనివాస్ ఎంపిక కావడం చాలా సంతోషాన్నిచ్చిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కి చెందిన ఒకే ఒక క్రీడాకారునికి ఈ అవకాశం రావడం అంతేకాకుండా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన క్రీడాకారున్ని కబడ్డీ కోచ్ గా నియమించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాంపెల్లి మల్లేశం, గుర్రం నర్సయ్య, బండి లక్ష్మిరాజం దీకొండ అశోక్, రాపర్తి లక్ష్మణ్ పురుషోత్తం ప్రసాద్, చల్ల సంతోష్ బల్ల పోశాలు, బల్ల మల్లేశం గుడిపల్లి తిరుపతి, చెన్న శ్రీధర్ పాసికంటి వెంకటేష్ పాల్గొన్నారు.