జోరుగా పల్లె ప్రగతి పనులు

Published: Tuesday July 06, 2021
పరిగి, జూలై 05, ప్రజాపాలన ప్రతినిధి : పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో జులై ఒకటి నుండి నేటివరకు పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతుంది. మొదటి రోజు గ్రామసభ పెట్టి ఆ సభలో ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో అన్ని వార్డులలో తిరుగుతూ ప్రజల సమస్యలను నోట్ చేసుకుంటూ వాటి పరిష్కారానికి పనులు చేస్తున్నారు,  డ్యామేజ్ అయిన స్తంభాల మార్పు, మురికి కాలువల శుభ్రం, శ్రమదానం శిథిలావస్థకు చేరిన గృహాల నమోదు, మొదలైన అంశాలను ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించేలా కార్యచరణ చేపడతామని గ్రామ సర్పంచ్ శాంత కొండారెడ్డి పంచాయతీ కార్యదర్శి మొగులయ్య అన్నారు. ప్రజలు ఏ సమస్య ఉన్న తమ దగ్గర వచ్చి వెల్లడిస్తే బాగుండు అని చెప్పారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి మొగులయ్యా మాట్లాడుతూ పల్లె ప్రగతి కేవలం పంచాయతీ అధికారులది కాదు ప్రజలందరిది కావున యువజన సంఘాలు ప్రజలు గ్రామాభివృద్ది కి తోడ్పడలని  ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పంచాయతీ కార్యదర్శి మొగులయ్య, గ్రామ సర్పంచ్ శాంత కొండారెడ్డి, ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పెద్దలు పల్లె ప్రగతి లో పాల్గొంటున్నారు