స్వయం ఉపాధికై మొబైల్ వాహనాలు ఎంతగానో తోడ్పడుతాయి : ప్రభుత్వ విప్ గాంధీ

Published: Monday March 29, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డ్ ఆర్థిక సహాయంతో జిహెచ్ఎంసీ పరిధిలోని నిరుద్యోగులకు మరియు స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ మొబైల్ వాహనములు (యూనిట్ విలువ రూ. 10 లక్షలు, సబ్సిడీ  60% అనగా రూ.6 లక్షలు మరియు లబ్ధిదారుల వాటా లేదా బ్యాంకు రుణం 40% అనగా రూ.4 లక్షలు) అర్హులైన మత్స్య కార్మికుల లబ్దిదారులకు మంత్రివర్యులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, బండ ప్రకాష్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్ యాదవ్, ముఠా గోపాల్, సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ విజయ రెడ్డిలు తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నిరుద్యోగులకు స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు సంచార మత్స్య విక్రయ మొబైల్ వాహనములు అందజేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సంఘం ద్వారా అందచేయడం జరిగినది. అని ఈ వాహనాల ద్వారా చేపల విక్రయంతో కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుందన్నారు. ఈ వాహనాల లోపల ఫ్రిజ్, వాటర్ ట్యాంక్, చేపలు కట్ చేసే యంత్రాలు, ఉంటాయి అని, ఈ వాహనాల ద్వారా కాలనీ లలో చేపలను అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి అని, ఉదయం చేపలు అమ్ముకొని సాయంత్రం చేపలు ఫ్రై చేసుకొని అమ్ముకోవచ్చునని రెండు విధాలుగా ఉపయోగపడుతాయని, చేపల ఆహారం పుష్టితో పాటు, ఆర్థిక పుష్టి పెరుగునని, స్వయం ఉపాధి కింద ఆర్థిక స్వావలంభన పెరుగునని, స్వయం ఉపాధికై సబ్సిడీ ద్వారా చేపల విక్రయానికి మొబైల్ వాహనాలను  ఎంతగానో తోడ్పడుతాయని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు