రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పనులను చేయడానికే నేను వచ్చా.. వైయస్సార్సీపి అధ్యక్షురాలు షర్మిల

Published: Monday November 07, 2022
బెల్లంపల్లి నవంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి:  తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పనులు కొనసాగటం లేదని, ఆ పనులను పునరుద్ధరించడానికి తను వచ్చానని వైయస్సార్సీపి అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
ఆదివారం  పాదయాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి వచ్చిన ఆమె స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, కెసిఆర్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే దళితుడై ఉండి కూడా దళితుల మీద దాడి జరుగుతుంటే ఏనాడైనా మీ పక్షాన మాట్లాడినాడ అని ప్రశ్నించారు, కెసిఆర్ కు భజన చేసే ఎమ్మెల్యేలు మనకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.
రైతులు చనిపోతే ఏ నాడైన వచ్చి వారి కుటుంబాలను పరామర్శించారా, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థులకు కొనసాగిస్తున్నాడా, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు ఏనాడైనా చేశాడా, బంగారు తెలంగాణ అంటూ బీర్ల తెలంగాణగా మార్చాడని, గతంలో పది లక్షల కోట్ల ఆదాయం ఉంటే ప్రస్తుతం నాలుగు రేట్లు పెంచి 40 కోట్ల ఆదాయానికి పెంచాడే తప్ప, మద్యం ఏరులై పాలిస్తున్నారని అన్నారు.
శేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని  ఏ ఒక్కటి ప్రస్తుతం కొనసాగించడం లేదని వాటిని కొనసాగించడానికే వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో తాను మీ ముందుకు వచ్చానని ఆమె అన్నారు.
స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్,కు ప్రస్తుతం హెలికాప్టర్లు, విమానాలు, కొంటున్నారని, ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి మూడేళ్లు గడిచిన ఒక్క ఎకరానికి కూడా నీరు అందించకపోగా లక్షల కోట్ల రూపాయలు మాత్రం వెనకేసుకున్నారని ఈ విషయంపై వైయస్సార్సీపి తరఫున తాను ఒక్కదాన్నే ప్రశ్నించానని, ప్రతిపక్షాల నాయకులు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదని అన్నారు, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడానికి తాను మీ ముందుకు వచ్చానని ఆమె అన్నారు.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తనని ఆదరించి అక్కున చేర్చుకుని రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీని ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.