అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కల సాకారం చేసుకోవాలి.

Published: Monday April 11, 2022
13వ బెట్టాలం డిఎస్పీ రఘునాథ్ చౌహన్.
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 10, ప్రజాపాలన : ఎసై, కానిస్టేబుల్ ఉద్యోగాలకోసం పోటీ పరిక్షలకు సిద్ధమౌతున్న నిరుద్యోగ యువతీయువకులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగం సాదించాలనే కలను సాకారం చేసుకోవాలని గుడిపేట 13వ బెట్టాలం డిఎస్పీ రఘునాథ్ చౌహన్ అన్నారు. ఆదివారం ఎసై, కానిస్టేబుల్ ఉద్యోగాలకోసం నిర్వహించే పోటీ పరిక్షలకు ఉచిత శక్షణ పోందడం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక పక్రియ చెపట్టారు. రాత పరీక్ష, దారుడ్య (పిజికల్ టెస్టు) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విన్నర్ ఐకాన్ స్టడీస్ సెంటర్ నాగరాజు - సమ్మయ్య ప్యాకల్టీ బృందంచే అన్ని సబ్జెక్ట్ లపై మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుం దని తెలిపారు. 2018లో ఎనిమిది వందల మందికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని 148 కానిస్టేబుల్., 78 మంది పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు సాదించినట్లు తెలిపారు. అదేవిధంగా మరో 387 మంది గృఫ్ 4, విఆర్వో ఉద్యోగాలు సాదించారని అన్నారు. అదేవిధంగా ఈ సారి కూడా ఎంపికైన అభ్యార్తులు పట్టుదలతో కృషి చేసి ఉధ్యోగాలు సాధించాలని కోరారు.
ప్రశాంతంగా ముగిసిన ఎంపిక రాత పరిక్షలు.
పోటీ పరిక్షలకు సిద్ధమౌతున్న నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ పోందడం కోసం 2764 మంది దరఖాస్తులు చేసుకోగా  రాత , శరీర దారుడ్య పరిక్షలు నిర్వహించారు. ఇందులో 764మంది మహిళలు, 2వేల మంది పురుషులు ఎంపిక పరిక్ష లకు హాజరయ్యారు. వీరిలో 8వందల మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని , ఎంపికైన వారి కి స్టడీ మెటీరియల్ , తో పాటు ముడు నెలల శిక్షణ ఇవ్వనున్నారు. పరిక్షలకు హాజరయిన యువతీయువకులకు త్రాగు నీరు , బోజనం తోపాటు వారికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బెట్టాలం పోలీసులు, ఐకాన్ స్టడీస్ సెంటర్ నాగరాజు - సమ్మయ్య ప్యాకల్టీ బృందం సభ్యులు పాల్గొన్నారు.