మెరుగైన రహదారుల నిర్మాణమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Saturday June 26, 2021
మధిర, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : తెలంణ ప్రభుత్వంలో రవాణా సౌకర్యం కోసం మెరుగైన రహదారులను నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని దానిలో భాగంగానే దెందుకూరు నుండి మాటూరు పేట వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన బిటి రోడ్డు నిర్మించడం జరిగిందని జడ్పీ చైర్మన్ కమల్ రాజు పేర్కొన్నారు. ఈ రహదారి ఎంతో మంది రైతులకు వారి వ్యవసాయ సాగుకు ఉపయోగపడుతుందని తెలిపారు. డొంక రోడ్ లను బిటి రోడ్లుగా మార్చి రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే టిఆర్ఎస్ లక్ష్యమన్నారు. శుక్రవారం ఈ బిటి రోడ్డు  పనులను టిఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర రావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగి శెట్టి కోటేశ్వరరావు, మధిర సొసైటీ చైర్మన్ బక్కిి ప్రసాద్ దెందుకూరు సొసైటీ చైర్మన్ కోట వెంకట కృష్ణ, టిఆర్ఎస్ నాయకులు వార్డు కౌన్సిలర్ మల్లాది వాసు, వై వి అప్పారావు, ప్యారి పాల్గొన్నారు.