చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ... జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషత్ధ్వని మంచిర్యాల బ్యూరో, ఆగస్టు02,

Published: Wednesday August 03, 2022
సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి  ఉపనిషత్ధ్వని తెలిపారు. మంగళవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.. ఈ సందర్భంగా చట్టాలు.. అవి కల్పించే రక్షణ గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ  చట్టం ద్వారా తగిన రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. బాలికలు, స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, తీసుకునే చర్యలను  జడ్జి వివరించారు. ఈ సందర్భంగా  స్థానిక న్యాయవాది రాజలింగు మోతె ముద్రించిన ఉచిత న్యాయ సహాయం సేవలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను  ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో  అదనపు జడ్జి ఎండి.అసదుల్లా షరీఫ్, స్థానిక పట్టణ ఎస్ఐ అశోక్, మంచిర్యాల బార్ అసోసియేషన్ కోశాధికారి కే. గంగయ్య,  న్యాయవాదులు ఎండి. తాజుద్దీన్, రాజలింగు మోతె, సమతా రాణి తదితరులు పాల్గొన్నారు.