బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు

Published: Thursday November 25, 2021
ముఖ్య అతిథిగా బోనకల్ ఎస్ఐ తేజావత్ కవిత
బోనకల్, నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తత గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ లింగమనేని నళిని శ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బోనకల్ ఎస్ఐ కవిత పాల్గొనడం జరిగింది. ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బోనకల్ మండలానికి ఒక మహిళ ఎస్సై రావడం సంతోషాన్ని కలుగజేసింది అన్నారు. బోనకల్ మండలంలో ఎక్కువమంది అధికారులు అందరూ మహిళలు కావడం చాలా సంతోషం దాయకం. ముఖ్యంగా బోనకల్ మండలం లో ఉన్నటువంటి మహిళలందరూ తమ సమస్యలను నిర్భయంగా ఎస్ఐ గారికి చెప్పుకోవచ్చును అని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి ఎస్సై కవిత మాట్లాడుతూ సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి విద్యార్థులు స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. మనకు పరిచయం లేని వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి, మోసపోక ముందే వాటి పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఒకవేళ మోసపోతే 155260 లేదా 100 కి కాల్ చేసి సైబర్ నేరాన్ని తెలియజేయండి, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే 24 గంటల్లో మాకు సమాచారం అందించినట్లు అయితే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము అని తెలియజేశారు. అంతేకాకుండా విద్యార్థులు యుటిజింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల్ని హెచ్చరించారు. ప్రతి ఒక్కళ్ళు తమ సోదరి లాగా ఆడపిల్లల్ని గౌరవించాలి అని అన్నారు. ఆడపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే నా నెంబర్ కి కాల్ చేయండి లేదా 100 కి డయల్ చేయండి అని తెలియజేశారు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోను, కళాశాలోను చదువుకొని ఉద్యోగాన్ని పొందాను. మీరు కూడా ఒక మంచి గోల్ ను ఏర్పరచుకొని బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు గురువులకు పేరు తేవాలని కోరుచున్నాను అని తెలియజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు ఎస్సై గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జె.జోనతాన్ బాబు, ఎ.శ్రీనివాస రావు, ఎ.రాజేంద్ర కుమార్, పి.లక్ష్మీకాంతం, డి.పద్మావతి, వి.రామకృష్ణ, యస్.రాజేంద్ర, ఎ.తిరుపతి రావు, ఎ.యు.ఎమ్.కృష్ణ, జి.ధనలక్ష్మి, డి.నాగమణి, శ్రీధర్, రవికుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.