ఉపాధి పనులను ప్రారంభించిన సర్పంచ్ మారెళ్ల మమత..

Published: Tuesday April 26, 2022
తల్లాడ, ఏప్రిల్ 25 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కూలీలతో కలిసి గడ్డపారతో మట్టిని తవ్వి ప్రారంభించారు. పొలాల్లో సాగునీరు వెళ్లేందుకు పూడిక తీయడం ద్వారా రైతులతో పాటు కూలీలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వేణు, గ్రామస్తులు గుమ్మా వలరాజు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.