ప్రైవేట్ టీచర్ కి ఆరోగ్య ఖర్చులకు ఆర్థిక సహాయం

Published: Tuesday June 01, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన పోలేపాక రమేష్ ప్రైవేట్ టీచర్ గా వలిగొండలో పని చేసేవాడు. కరోనా వలన సంవత్సరం నుంచి జీతాలు లేక దినసరి కూలి పనికి పోయేవాడు. ఇటీవల కరోనా రావడంతో అనారోగ్యానికి గురై ఉప్పల్ ఆదిత్య హాస్పిటల్ చేర్చడంతో తలలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఇప్పుడు ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ తెలిపారు. హాస్పిటల్ ఆపరేషన్ ఖర్చు రోజుకు 70 నుండి 80 వేల వరకు అవుతుందని, వారి కుటుంబం పేద కుటుంబం మని గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత సహాయం వారు చేస్తున్నారు, వారి కుటుంబ సభ్యులు కుమారుని ఆరోగ్యానికి అగు ఖర్చులకు గ్రామస్తులకు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.